- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆన్‌లైన్ గేమింగ్ ఉచ్చు మీ జీవితాన్ని ఏమార్చుతుంది : ఎస్పీ జానకి

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: సెల్ ఫోన్ లో ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగులు మీ జీవితాలను ఏ మార్చుతుందని జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో హెచ్చరించారు.తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో సంపాదించాలనే ఆకాంక్షతో యువత అక్రమ గేమింగ్,బెట్టింగ్ యాప్స్ కు బానిసలుగా మారి,ఆర్ధికంగా నష్ట పోవడంతో పాటు,చివరకు ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె విచారం వ్యక్తంచేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేకంగా గమనిస్తూ,శ్రద్ధ వహించాలని,వారు సెల్ ఫోన్ లో చేసే కార్యకలాపాలను ఓ కంట కనిపెడుతుండాలని సూచించారు.నేటి యువత విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్,నిషేధిత గేమింగ్ ప్లాట్ ఫార్మ్స్,ఐపీఎల్ బెట్టింగ్ లకు పూర్తి దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు.
ఈ సందర్భంగా ఆమె బెట్టింగ్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేస్తూ,క్రికెట్ బెట్టింగ్,ప్లేయింగ్ కార్డ్స్,బెట్టింగ్ యాప్స్,ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తీవ్రంగా హెచ్చరించారు.బెట్టింగ్ యాప్ లను ఉపయోగించడం ద్వారా వ్యక్తిగత సమాచారం,బ్యాంకు అకౌంట్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే ప్రమాదముంది కనుక,వారి ఉచ్చులో పడకండని ఆమె తీవ్రంగానే హెచ్చరించారు.జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి,ఏమైనా బెట్టింగ్ కార్యకలాపాల గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని,అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ జానకి భరోసా ఇచ్చారు.