Balakrishna vs Ram Charan: ఈ సారి చరణ్‌తో పోటీకి సిద్దమవుతున్న బాలయ్య..

by Prasanna |   ( Updated:2024-10-13 05:19:09.0  )
Balakrishna vs Ram Charan: ఈ సారి చరణ్‌తో పోటీకి సిద్దమవుతున్న బాలయ్య..
X

దిశ, వెబ్ డెస్క్ : బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK109 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేయగా తాజాగా దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు. NBK 109 సంక్రాంతి బరిలో ఉంటుందని ప్రకటించారు. అలాగే, టైటిల్ అనౌన్స్ దీపావళికి రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇది పీరియాడిక్ యాక్షన్ మూవీ అని తెలిసిన సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ఓ గుర్రంపై బాలయ్య వేటకు బయలుదేరినట్టు కనిపిస్తున్నాడు.

ఇప్పటివరకు చిరంజీవితో బాలయ్య ఎన్నోసార్లు సంక్రాంతికి పోటీ పడ్డాడు. కానీ, ఈ సారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పోటీ పడనున్నాడు. మరి ఈ సమరంలో ఎవరు గెలుస్తారో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Read More : నీ వల్ల నిద్రలేని రాత్రులు గడిపాను’.. మరోస్టార్ హీరోకు మనసులోని మాట డైరెక్ట్‌గా చెప్పేసిన మెగాస్టార్..!

Next Story

Most Viewed