Kavya Kalyanram: రెడ్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న ‘బలగం’ బ్యూటీ..

by Prasanna |
Kavya Kalyanram: రెడ్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న  ‘బలగం’ బ్యూటీ..
X

దిశ, వెబ్ డెస్క్ : నటి కావ్యా కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ బాలనటిగా అడుగుపెట్టి ప్రస్తుతం, వరుస సినిమాలతో దూసుకుపోతుంది. స్నేహమంటే ఇదేరా అనే మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత గంగోత్రి, బన్నీ, బాలు, ఠాగూర్, పాండురంగడు, విజయేంద్ర వర్మ, అడవి రాముడు, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాల్లో నటించింది.

‘మసూద’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ‘బలగం’ మూవీలో కథానాయికగా నటించి బ్లాక్ బస్టర్ హట్ అయి ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ సినిమాలో అందం, ఆమె నటనకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ‘ఉస్తాద్’ అనే మూవీలో నటించింది,

కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఆమె అభిమానుల కోసం ఫొటోలను షేర్ చేసి అలరిస్తుంది. రెడ్ కలర్ టాప్‌లో ఉన్న ఫోటోస్ ను చూసిన నెటిజన్స్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత అందాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Next Story

Most Viewed