- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'దళిత బంధు' అవగాహన సదస్సులో.. లబ్ధిదారులకు సూచనలు
దిశ, సంగారెడ్డి: జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం గొడ్ గార్ పల్లి గ్రామంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య , డిపిఓ సురేష్ మోహన్ తదితరుల అధికారుల బృందాలు పర్యటించి.. దళిత బంధు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి యూనిట్ల ఎంపికపై ఆదివారం అవగాహన కల్పించారు. అంతకుముందు గ్రామంలోని చర్చి వద్ద లబ్ధిదారులతో సమావేశమై దళిత బంధు పథకంను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగుతూ.. జీవితంలో స్థిరపడాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.
పది లక్షలతో ఒకే యూనిట్ కాకుండా కుటుంబంలోని వ్యక్తులు రెండు/మూడు యూనిట్లను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలలో నిరంతర ఆదాయాన్ని ఇచ్చే యూనిట్లు అయితే లబ్ధిదారులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. ఆయా యూనిట్ల నిర్వహణకు సంబంధించి అవసరమైన శిక్షణ కూడా ఉంటుందని తెలిపారు.
ఆయా బృందాలు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి వారు ఎంపిక చేసుకున్న యూనిట్, ఆయా యూనిట్లపై వారికున్న అనుభవం, యూనిట్ ఏర్పాటుకు అవసరమైన వసతి సౌకర్యాలు, మార్కెటింగ్ ఏ విధంగా ఉంది, సంబంధిత యూనిట్ వారికి లాభదాయకమా అన్న వివరాలను అధ్యయనం చేస్తూ.. పరిశీలించారు.
ఆ యూనిట్ తో లబ్దిదారులకు లబ్ధి జరుగుతుందా, ఎలాంటి ఆటుపోట్లు ఎదురవుతాయి, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి యూనిట్ వారికి లాభదాయకంగా ఉంటుందన్న విషయాలపై అవగాహన కల్పించారు. యూనిట్ ఎంపికలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి సరైన యూనిట్ ఎంపిక చేసుకోవాలని సూచించారు.
లబ్ధిదారుల కుటుంబంలోని సభ్యుల ప్రస్తుత వృత్తి, ఆదాయ వనరులు, ఏ ఏ రంగంలో అనుభవం ఉందన్న వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ సురేష్ మోహన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు, రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.