- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'చిరుత' భయం భయం
దిశ, చిన్న శంకరంపేట: చిరుతపులి మూడు రోజుల నుండి పశువుల పై దాడి చేసి రెండు లేగదూడలు, ఒక దుప్పికను చంపి తినేసింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట ఉమ్మడి మండలం గ్రామ పంచాయతీ జప్తి శివనూర్ పరిధి కాశయ్య తండాలోని లంబాడి మంగ్య కు చెందిన లేగదూడను రాత్రి పులి చంపి తినేసింది. కాగా శనివారం రాత్రి జప్తి శివనూర్ గ్రామానికి చెందిన రైతు మైలారం స్వామి పశువుల పాక పై చిరుత దాడి చేసి లేగదూడలను చంపి తినేసింది. రెండు రోజుల నుండి చిరుతపులి సంచరిస్తూ లేగదూడలపై దాడి చేసి, చంపి తినేయడంతో గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
రైతులు పంట పొలాల వద్దకు వెళ్లాలంటే జంకుతున్నారు. పశువులను మేత కోసం మేపేందుకు వెళ్లేందుకు భయం గుప్పిట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారి బలరాం తన సిబ్బందితో, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాగా ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో గుట్ట రాళ్ళలో దుప్పికను చంపి తినేసింది పులి. దీంతో పంట పొలాలకు రైతులు పోవాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయంపై డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ అధికారి కుతుబుద్దీన్ ను వివరణ కోరగా.. గ్రామ శివారులోని పంట పొలాల వద్దకు ఎవరు వెళ్లవద్దని, జాగ్రత్తగా ఉండి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ఆ పులి కోసం బోన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.