Ashok Galla: SSMB 29 నుంచి మహేష్ బాబు ఫస్ట్ లుక్‌పై ప్రిన్స్ మేనల్లుడు ఆసక్తికర కామెంట్స్

by Anjali |
Ashok Galla: SSMB 29 నుంచి మహేష్ బాబు ఫస్ట్ లుక్‌పై ప్రిన్స్ మేనల్లుడు ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పెద్ద ప్రాజెక్టులో నటిస్తున్నాడు. SSMB29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతున్నన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఇప్పటికే భారీగా గడ్డం పెంచి.. అభిమానులు ఊహించని లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. జిమ్ లో కూడా ప్రిన్స్ భారీ వర్కౌట్స్ చేసి తెగ కష్టపడ్డాడు. ఇకపోతే ఈ హీరో మేనల్లుడు అశోక్ గల్లా(Ashok Galla) దేవకీ నందన వాసుదేవ(Devaki Nandana Vasudeva) మూవీతో హీరోగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోన్నన విషయం తెలిసిందే.

కాగా ఈ చిత్రం నవంబరు 22 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి.. ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమానికి సూపర్ స్టార్ హాజరవుతున్నారంటూ ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా దేవకీ నందన వాసుదేవ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అశోక్ గల్లా ఈ వార్తలపై స్పందించారు. దర్శకుడు రాజమౌళి(Rajamouli) సినిమాతో మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నారని.. కాగా ఈసారి ఆయన రావడం కుదరకపోవచ్చని వెల్లడించాడు.

బయట కొన్ని ఫొటోలు లీకైన.. ఆ హెవీ లుక్ ని జాగ్రత్తగానే దాస్తున్నారని అన్నాడు. సూపర్ స్టార్ ఫస్ట్ లుక్ నెటిజన్లకు గట్టి ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారని.. లుక్స్ బయటకు రాకూడదు కాబట్టి రారని తెలిపాడు. తను కూడా అడగలనుకోవట్లేదని అశోక్ పేర్కొన్నాడు. ఈ కుర్ర హీరో వ్యాఖ్యలు విన్నాక జనాలు SSMB29 నుంచి మహేష్ బాబు ఫస్ట్ లుక్ పై భారీ అంచనాలు పెంచుకున్నారు.

Advertisement

Next Story