pregnancy: ప్రెగ్నెన్సీ రాకుండా ఇలా చేస్తున్నారా.. ప్రాణాలకే ప్రమాదం?

by Anjali |
pregnancy: ప్రెగ్నెన్సీ రాకుండా ఇలా చేస్తున్నారా..  ప్రాణాలకే ప్రమాదం?
X

ప్రెగ్నెన్సీ రాకుండా ఈ పద్ధతి ఫాలో అవుతున్నారా.. గుండెపోటు వచ్చే ప్రమాదం..?

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లయ్యాక చాలా మంది సెటిల్ అయ్యాక పిల్లల ప్లానింగ్ చేసుకుంటారు. లేకపోతే ఒకరు జన్మించాక.. సెకండ్ బిడ్డ కోసం కొంత గ్యాప్ తీసుకుంటారు. కాగా ఈ క్రమంలో భర్తభర్తలు పిల్లలు కలగకుండా జనన నియంత్రణ పద్ధతుల్ని ఫాలో అవుతుంటారు. అలాగే కొంతమంది గర్భనిరోధక మాత్రలు, ఇంప్లాంట్స్ కూడా భాగమే. కానీ ఇలాంటివి యూజ్ చేస్తే మహిళలకు హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా స్ట్రోక్ ప్రాబ్లమ్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు.

గర్భనిరోధ మాత్రలు వాడితే ప్రస్తుతం బాగానే ఉన్నా.. భవిష్యత్తులో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈస్ట్రోజన్ నిండిన యోని రింగ్ లేదా బర్త్ కంట్రోల్ పాచ్ వంటివి కూడా గర్భనిరోధక పద్ధతుల్లో ఒక భాగమే. కాగా ఇవి మరింత ఎక్కువ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయని నిపుణులు చెబుతున్నారు.

కొంతమంది గర్భనిరోధక పద్ధతుల్ని టాబ్లెట్ల రూపంలో తీసుకుంటే.. మరికొంతమంది ఇంజక్షన్ రూపంలో తీసుకుంటారు. కాగా ఇవి హార్మోన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని డెన్మార్క్ శాస్త్రవేత్తలు చేసిన కొత్త అధ్యయనంలో వెల్లడైంది. అలాగే వీటి వల్ల రక్తం గడ్డ కడుతుంది. పలు రకాల క్యాన్సర్లు తలెత్తుతాయి. మూత్రపిండాల వ్యాధులు తలెత్తుతాయి. ఎండోమెట్రియోసిస్ వ్యాధులు వస్తాయి. ఇస్కీమిక్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటివి రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story