ఆకాశం నుంచి రాలిపడ్డ 'ఏలియన్'.. క్లూలెస్‌గా బయాలజిస్ట్స్

by Disha News Web Desk |   ( Updated:2022-03-03 09:15:38.0  )
ఆకాశం నుంచి రాలిపడ్డ ఏలియన్.. క్లూలెస్‌గా బయాలజిస్ట్స్
X

దిశ, ఫీచర్స్ : సమస్త విశ్వం నిగూఢ రహస్యాలకు వేదిక. పెరుగుతున్న సాంకేతికత, శాస్త్ర విజ్ఞానం అంతుచిక్కని అనేక అంశాల గుట్టు విప్పుతున్న.. ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలెన్నో వెంటాడుతున్నాయి. ఎగిరే పళ్లేలు(UFO), ఏలియన్స్ ఆ కోవకు చెందినవే కాగా.. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ వీధుల్లో ఒక చిన్న జీవి వెలుగుచూసింది. హ్యారీ హేస్ అనే వ్యక్తి మార్నింగ్ జాగింగ్ చేస్తుండగా ఓ వింత జీవి అతని కంటపడింది. జీవశాస్త్రవేత్తలు కూడా ఈ జీవి పట్ల ఒక అంచనాకు రాలేకపోతుండగా.. సిడ్నీలో ఇటీవల కురిసిన వర్షాలకు ఆకాశం నుంచి రాలిపడిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హారిస్.. సిడ్నీ నగరంలోని మారిక్‌విల్లే గుండా జాగింగ్ చేస్తున్నప్పుడు వింత ఆకారంలో ఉన్న ఈ జీవిని చూసినట్లు లాడ్‌బైబిల్ మీడియా నివేదించింది. ఈ అనుభవం పట్ల స్పందించిన హేస్.. 'ఇది ఒక రకమైన పిండమని నా అంతరాత్మ చెబుతోంది. కానీ కొవిడ్, వరల్డ్ వార్ III, వరదల(ప్రస్తుతం కొనసాగుతున్నాయి) నేపథ్యంలో గ్రహాంతరవాసి అయ్యుండొచ్చు' అని చెప్పారు. ఇదిలా ఉంటే 'యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌' కూడా ఈ జీవిని గుర్తించలేకపోయాయి.

ఇక 2022 ప్రారంభంలో 'టైమ్-ట్రావెలింగ్' టిక్‌టాకర్ ఒకరు.. మానవ జాతి త్వరలోనే భూమిలోపలి మొదటి గ్రహాంతర జీవిని కనుగొంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. 'నన్ను అందరూ ఫేక్ టైమ్ ట్రావెలర్‌గా భావిస్తున్నారు. కానీ నేను చెప్పినవన్నీ నిజమని త్వరలోనే నిరూపించగలను. ఈ మూడు తేదీలను గుర్తుంచుకోండి' అని @pasttimetravel పేరుగల టిక్‌టాక్‌ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఆగస్టు 2 , 2022న భూగర్భ నాగరికతతో సంబంధాన్ని ఏర్పరచుకుంటామనే విషయం మ్యాచ్ అవుతుండగా.. ఆర్నెళ్ల ముందే వింత జీవి బయపడటం విశేషం.

Advertisement

Next Story