ఆగష్టు 7 నుంచి 'ఆకాశ ఎయిర్' సంస్థ వాణిజ్య కార్యకలాపాలు మొదలు!

by Satheesh |
ఆగష్టు 7 నుంచి ఆకాశ ఎయిర్ సంస్థ వాణిజ్య కార్యకలాపాలు మొదలు!
X

న్యూఢిల్లీ: దేశీయంగా కొత్త విమానయాన సేవలను ప్రారంభించనున్న కొత్త సంస్థ 'ఆకాశ ఎయిర్ ' త్వరలో తన వాణిజ్య కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోనంది. ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మద్దతిస్తున్న ఈ సంస్థ తొలి విమానాన్ని ఆగష్టు 7వ తేదీన ప్రారంభించనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలి విమానం ముంబై-అహ్మదాబాద్ మధ్య నడపనునట్టు, ఆ తర్వాత ఆగష్టు 13 నుంచి బెంగళూరు నుంచి కొచ్చి మధ్య విమాన సేవలను ప్రారంభించనున్నట్టు కంపెనీ వివరించింది.

ఈ రెండు సర్వీసుల కోసం ఇప్పటికే టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. ఈ రెండు విమాన సేవల కోసం బోయింగ్ 737 మ్యాక్స్ ఫ్లైట్ల ద్వారా కమర్షియం కార్యకలాపాలను మొదలు కానున్నాయి. ఇప్పటికే ఈ విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. మరొక విమానం ఈ నెలాఖరులో కంపెనీ వద్దకు చేరనుంది. ధరలకు సంబంధించి ఆకాశ ఎయిర్ ముంబై-అహ్మదాబాద్ మధ్య కనీస వన్-వే ఛార్జీని రూ. 3948గా నిర్ణయించింది. భవిష్యత్తులో ఇతర నగరాలకు కార్యకలాపాలను విస్తరిస్తామని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు ప్రవీణ్ అయ్యర్ చెప్పారు. ఈ ఏడాదిలో నెలకు రెండు కొత్త విమానాలు కంపెనీ వద్దకు రానున్నాయని ఆయన తెలిపారు. కాగా, ఆకాశ ఎయిర్ సంస్థ గతేడాది నవంబరులో మొత్తం 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఒప్పందం చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed