Aishwarya Rai- Abhishek: ఐశ్వర్యరాయ్‌తో అభిషేక్ బచ్చన్ విడాకులు.. సంచలన పోస్ట్ పెట్టిన నటి

by Hamsa |   ( Updated:2024-11-07 08:28:56.0  )
Aishwarya Rai- Abhishek: ఐశ్వర్యరాయ్‌తో అభిషేక్ బచ్చన్ విడాకులు.. సంచలన పోస్ట్ పెట్టిన నటి
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్(Aishwarya Rai), అభిషేక్ బచ్చన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఆరాధ్య(Aaradhya Bachchan) అనే కూతురు కూడా ఉంది. అయితే గత కొద్ది కాలం క్రితం వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయారని పలు వార్తలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశ మవుతున్నాయి. అలాగే అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉండటంతో.. ఐష్ కాపురంలో కలహాలు మొదలై విడాకులు తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ దీనిపై ఐశ్వర్య, అభిషేక్ స్పందించకపోవడంతో అంతా నిజమేనని ఫిక్స్ అయిపోయారు. మరీ ముఖ్యంగా ఇటీవల ఐశ్వర్య పుట్టినరోజు(birthday) నాడు.. అభిషేక్ (Abhishek Bachchan)నుంచి కనీసం విషెస్ కూడా రాలేదు. దీంతో వీరిద్దరి విడాకుల వార్తలకు బలం చేకూరినట్లు అయింది. ఇక నెటిజన్లు అభిషేక్‌ను తప్పు పడుతూ భార్యకు విష్ చేయకపోవడమేంటని మండిపడుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, నటి సిమి గరేవాల్(Simi Garewal) ఇన్‌స్టాగ్రామ్‌లో అభిషేక్ తరపున మాట్లాడుతూ ఓ సంచలన పోస్ట్ షేర్ చేసింది.

‘‘అభిషేక్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన బాలీవుడ్‌(Bollywood)లోని మంచి వ్యక్తులలో ఒకడని అంగీకరిస్తారు. నేను కూడా అతను చాలా మంచి వ్యక్తి అని భావిస్తున్నాను. అభిషేక్‌కు మంచి విలువలు, మర్యాద గురించి బాగా తెలుసు’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో సిమి పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఇక అది చూసిన నెటిజన్లు ఆమెపై ఫైర్ అవడంతో పాటు ట్రోల్ చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సిమి తన పోస్ట్‌ను తొలగించింది.

Advertisement

Next Story