ఈ నెల 16న భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం: అమృతసర్‌లో కేజ్రివాల్ రోడ్ షో

by Harish |
ఈ నెల 16న భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం: అమృతసర్‌లో కేజ్రివాల్ రోడ్ షో
X

ఛంఢీగఢ్: పంజాబ్‌లో సంచలన విజయం సాధించిన ఆప్ ఈ నెల 16న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సీఎం భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆప్ అఖండ విజయం తర్వాత సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను కలిశారు. ఆదివారం అమృత్ సర్ లో వీరిద్దరూ కలిసి విజయోత్సవ ర్యాలీని నిర్వహించనున్నారు. అంతేకాకుండా ప్రమాణ స్వీకారానికి భగవంత్ కేజ్రీవాల్ ను ఆహ్వానించారు. దురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భగవంత్ కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గాల్డీపై 58 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. కాగా తన ప్రమాణస్వీకారాన్ని రాజ్‌భవన్‌లో కాకుండా స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామంలో చేస్తానని ప్రకటించారు.

Next Story