జిమ్నాస్టిక్స్ చేస్తున్న కుక్క‌లు.. నెట్టింట్లో న‌వ్వులే న‌వ్వులు! (వీడియో)

by Sumithra |
జిమ్నాస్టిక్స్ చేస్తున్న కుక్క‌లు.. నెట్టింట్లో న‌వ్వులే న‌వ్వులు! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః శున‌కాల స‌ర‌దా చేష్ట‌లంటే ఎవ్వ‌రికైనా ఇష్ట‌మే! ప్రొఫెష‌న‌ల్‌గా ఉండే పోటీలు కాదు గానీ కుక్క‌లు స‌హ‌జంగా చేసే అల్ల‌రి చేష్ట‌లు చూస్తే న‌వ్వు ఆపుకోలేము. స‌రిగ్గా ఇలాగే కుక్కలు జిమ్నాస్టిక్స్‌ చేస్తున్న వీడియో ఒక‌టి నెట్టింట్లో అంద‌ర్నీ మెప్పిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్‌లో, రెండు కుక్కలు థ్రిల్లింగ్ జిమ్నాస్టిక్స్‌ ప్రదర్శించడం చూడొచ్చు. స్టోర్‌రూమ్‌కు ద‌గ్గ‌ర‌ ఆడుకుంటున్న ఈ శున‌కాలు, బహుశా వాటి యజమాని లేకపోబ‌ట్టేమోగానీ.. చిక్కుబడ్డ నైలాన్ తాడును ప‌ట్టుకొని ఊగ‌డానికి లాంగ్ జంప్ చేస్తూ తెగ సంబ‌ర‌ప‌డుతుంటాయి. ప‌క్క‌నున్న చెక్క బల్ల మీద ఎక్కడానికి పోటీప‌డుతుంటాయి. చివ‌రికి కుక్కలు రెండూ తాడును పట్టుకుని ఊగడంతో పాటు చాలా సరదాగా ఉన్నారని సూచించ‌డానికి వాటి తోకలు కూడా సంతోషంగా ఊపుతుంటాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో జంతు ప్రేమికుల‌నే కాదు అంద‌రి హృదయాలను గెలుచుకుంది. మిలియన్ల కొద్దీ వ్యూవ్స్‌తో ట్రెండింగ్‌లో ఉంది.

These excited dogs playing gymnastics are winning hearts- Watch viral videoమీరూ చూడండి..

Advertisement

Next Story

Most Viewed