- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Dharmendra Pradhan: సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ.. అసలు విషయం ఇదే!

దిశ, వెబ్‌డెస్క్: కంచ గచ్చిబౌలి (Kacha Gachibowli) భూ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (HCU) చెందిన 400 ఎకరాల భూమి విషయంలో జోక్యం చేసుకోవాలని ఇటీవలే బీజేపీ (BJP) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు బుధవారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి, ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. ఆ లేఖలో వేలం వేయాలనుకుంటున్న భూమిలో 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం పర్యావరణానికి విఘాతం కలిగించేలా వ్యవహరించకూడాదంటూ లేఖలో ప్రస్తావించారు. అదేవిధంగా వివాదాస్పద 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం అధికారులతో ఎలాంటి సర్వే నిర్వహించలేదని.. అలాంటప్పుడు సరిహద్దులను ఎలా గుర్తిస్తారని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC)కు ప్రత్యామ్నాయంగా మరోచోట స్థలాన్ని కేటాయించాలని ధర్మేంద్ర ప్రధాన్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.