- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రొయ్య ముక్కులోకి దూరి ఎంత పని చేసింది... అతడి అవస్థలు చూస్తే..
దిశ, వెబ్‌డెస్క్ :కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటిల్లో కొన్ని ఘోరమైనవి ఉన్నా.. మరి కొన్ని ఫన్నీగా ఉంటాయి.అయితే చూడటానికి అది జోక్‌గా అనిపించినా.. బాధితులకు మాత్రం దాని తాలుకూ బాధలు తప్పవు. చేపలు పడుతున్న వ్యక్తి ముక్కులోకి ఓ రొయ్య దూరి అతడిని ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చిన సంఘటన ఏలూరు జిల్లాలో జరిగింది.
గణపవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక చెరువులో చేపలు పట్టుకోవడానికి వెళ్లాడు. వల విసిరితే కుప్పలు తెప్పలుగా రొయ్యలు చిక్కాయి. ఆ ఆనందం ఉన్న అతడు వంగి రొయ్యలను వల నుంచి తీస్తుండగా ఓ రొయ్య ఎగిరి అతడి ముక్కులోకి దూరింది. వెంటనే స్థానికులు దానిని బయకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా అది మరింత లోపలికి వెళ్లిపోయింది. దీంతో సదరు వ్యక్తికి ఊపిరి ఆడక ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఏలూరు ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు దానిని తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఔరా.. రొయ్య ఎంత పని చేసిందిగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.