- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫైబర్ అధికంగా ఉండే 8 కూరగాయలు ఇవే.. లాభాలు తెలిస్తే తినకుండా ఉండలేరు?

దిశ, వెబ్‌డెస్క్: ఫైబర్ అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఫైబర్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వడంలో తోడ్పడుతుంది. మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వీటితో పాటుగా ఆరోగ్యకరమైన ప్రేగులను కలిగి ఉండటానికి సహాయపడుతుంది.
దీర్ఘకాలిక వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా..ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు చూసినట్లైతే.. కాగా పండ్లు, ఓట్స్, చిరుధాన్యాలు, బార్లీ, అవిసె గింజలు, సైలియం, కాయధాన్యాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ అండ్ టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక ఫైబర్ ఆహారం మలబద్ధకం, అతిసారం మరియు హేమోరాయిడ్స్ వంటి జీర్ణ సమస్యల చికిత్సకు కూడా సహాయపడుతుంది.
అయితే అత్యధిక ఫైబర్ కలిగిన 8 కూరగాయలు ఇవేనంటూ తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు. లాభాలు కూడా బోలెడు. మరీ నిపుణులు చెప్పిన ఆ కూరగాయలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫైబర్ అధికంగా ఉండే కూరలో బ్రోకలీ ఒకటి. వంద గ్రాముల బ్రోకలిలో 2. 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది గట్ హెల్త్‌ను ప్రోత్సహించడమే కాకుండా.. వెయిట్ లాస్ అయ్యేందుకు మేలు చేస్తుంది.
అలాగే క్యారెట్లలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వంద గ్రాముల క్యారెట్ లో 2. 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుంది. బచ్చలి కూర లో కూడా 2. 2 గ్రాముల ఫైబర్, చిలకడదుంపల్లో మూడు గ్రాముల ఫైబర్, కాలీఫ్లవర్‌లో రెండు గ్రాముల ఫైబర్, 100 గ్రాముల ఆర్టిచోక్‌లులో 5. 4 గ్రాముల ఫైబర్, పచ్చి బఠానీల్లో 5.7 గ్రాముల ఫైబర్ ఉంటుందని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.