టెలిగ్రామ్ పంట పండింది.. ఒక్కరోజులోనే 70 మిలియన్ యూజర్స్

by Harish |   ( Updated:2021-10-06 10:11:03.0  )
Teligram
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఒకరికి జరిగిన నష్టం.. మరొకరికి భారీ లాభాలను చేకూర్చింది. సోషల్ మీడియా ప్లాట్ ఫాముల్లో నిత్యం పోటీ ఉండడం సహజమే. అయితే సోమవారం రాత్రి సాంకేతిక లోపంతో దాదాపు 7 గంటలపాటు ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. వీటిని పునరుద్దరించేందుకు మార్క్ బృందం విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం భారీగా జరిగిపోయింది. ఈ క్రమంలో సంస్థల సీఈవో మార్క్ జుకర్ బర్గ్‌కు దాదాపు రూ.53 వేల కోట్ల నష్టం వచ్చింది. దీనిని టెలిగ్రామ్ క్యాష్ చేసుకుంది. రాత్రికి రాత్రే యూజర్ల విశ్వాసాన్ని చూరగొన్నది.

వాట్సప్ ఇప్పటికే గోప్యతా నిబంధనలను మార్చడం, సాంకేతిక సమస్య రావడంతో ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్‌లపై ఎంతో మంది యూజర్లకు ఇంట్రెస్ట్ పోయింది. ఈనేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మరో సోషల్ వేదికను ఎంచుకున్నారు. అలా చూసే వారికి టెలిగ్రామ్, ట్విట్టర్ యాప్‌లు బెటర్‌గా కనిపించాయి. దీంతో ఫేస్‌బుక్, వాట్సప్ యూజర్లు దాదాపు 70 మిలియన్ల వరకూ టెలిగ్రామ్ వైపు వచ్చినట్లు టెలిగ్రామ్‌ సంస్థ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ప్రకటించారు. ఇలా అనూహ్యంగా 7 గంటల పాటు జరిగిన సాంకేతిక లోపం టెలిగ్రామ్, ట్విట్టర్ వంటి వాటికి లాభాలను తెచ్చిపెట్టిందనే చెప్పాలి.

Advertisement

Next Story

Most Viewed