- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాయలసీమపై 27న తెలంగాణ వాదనలు
దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్‌లో మంగళవారం వాడి వేడి వాదనలు జరిగాయి. తెలంగాణ తరఫున వాదనలను ఈ నెల 27వ తేదీన వింటామని ధర్మాసనం పేర్కొన్నది. కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఈ నెల 27 తర్వాత ట్రిబ్యునల్ తీర్పు వెలువరించనున్నది. ఈ నెల 30వ తేదీన ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ పదవీకాలం ముగుస్తున్నందున అప్పటిలోగా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ గవినోళ్ళ శ్రీనివాస్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదించారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నదని గతంలో గవినోళ్ళ శ్రీనివాస్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ట్రిబ్యునల్ ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమర్పించిన నివేదికను పరిశీలించారు. నివేదికలో తప్పుడు వివరాలను సమర్పించారని, వాస్తవాలు అందుకు వరుద్ధంగా ఉన్నాయంటూ శ్రీనివాస్ కొన్ని వీడియోలను, ఫోటోలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్ళారు. తప్పుడు వివరాలను సమర్పించి కేసు విచారణను తప్పుదోవ పట్టించారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జరిగిన పలు విచారణల సందర్భంగా గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం అమలుచేయకుండా ఉల్లంఘించినందుకు ప్రధాన కార్యదర్శి ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
కోర్టు ధిక్కరణ అంశాన్ని తాజా విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినవారిపై చర్యలు తీసుకునే అధికారం గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఉందని వాదించారు. ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 26, 28 ప్రకారం ఆ అధికారం ఉన్నదని, ఈ నెల 30వ తేదీన ఏపీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ రిటైర్ అవుతున్నందున ఈ లోగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్ళారు. ట్రిబ్యునల్‌కు ఉన్న అధికారాలపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను కూడా తాజా విచారణ సందర్భంగా ప్రస్తావించారు. తీర్పు ఉల్లంఘనలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్జీటి తీర్పులను ఉల్లంఘించినప్పుడు నేరుగా జైలుకు పంపిన సందర్భాలు లేకపోయినప్పటికీ ప్రస్తుతం రాయలసీమ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టంగా ఉల్లంఘించిన ఉదాహరణలు కళ్ళముందు కనిపిస్తున్నందున చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిజానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాల గురించి చాలాకాలం పాటు అందులో పనిచేసిన అధికారులు, కమిషనర్లకే తెలియదని, టీఎన్ శేషన్ ప్రధాన కమిషనర్ అయిన తర్వాత వివిధ సందర్భాల్లో వాటి గురించి అందులోని ఉద్యోగులకు, బాహ్య ప్రపంచానికి తెలిసిందని న్యాయవాది శ్రావణ్ గుర్తుచేశారు.
ఈ వాదనలపై ట్రిబ్యునల్ స్పందించకపోయినా తెలంగాణ వాదనలను వినాల్సి ఉన్నదని పేర్కొని అందుకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నది. ఈ నెల 27వ తేదీన తెలంగాణ వాదనలను వింటామని పేర్కొని తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదావేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడినందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆ తర్వాత తీర్పును వెలువరించనున్నట్లు ట్రిబ్యునల్ పేర్కొన్నది.
- Tags
- court