బిగ్ బ్రేకింగ్: టీ- టీడీపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌కు ముహూర్తం ఫిక్స్

by Satheesh |   ( Updated:2023-08-21 17:54:02.0  )
బిగ్ బ్రేకింగ్: టీ- టీడీపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌కు ముహూర్తం ఫిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీ 36 మందితో ఈ నెల 23న తొలి జాబితాను విడుదల చేయనుంది. సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నివాసంలో టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు ముఖ్య నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో బస్సుయాత్రతో పాటు రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ ఏ పార్టీతో పొత్తుపెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. తెలంగాణలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు.

విజన్ 2020 పెట్టి అభివృద్ధి చేశామని.. నేడు విజన్ 2047తో మందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణలో పార్టీ ఉండడం చారిత్రాత్మ అవసరమని అభ్యర్థులు విజయం సాధించాలన్నారు. ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, కాసాని వీరేశం, జక్కలి ఐలయ్యయాదవ్, అలి మస్కతి, సామ భూపాల్ రెడ్డి, బండారు వెంకటేష్ తో పాటు పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story