ముందే చెప్పిన ‘దిశ’.. కోమటిరెడ్డి సమక్షంలో భారీగా చేరికలు

by GSrikanth |   ( Updated:2023-10-17 07:29:29.0  )
ముందే చెప్పిన ‘దిశ’.. కోమటిరెడ్డి సమక్షంలో భారీగా చేరికలు
X

దిశ, నల్లగొండ: నల్లగొండలో ఊహించిందే జరిగింది. ముందే ‘దిశ’కు అందిన సమాచారం మేరకు ఆరుగురు కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్ ఆధ్వర్యంలో మూకుమ్మడిగా బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి కోమటిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే నల్లగొండలోని మరి కొంతమంది ప్రజా ప్రతినిధులు త్వరలోనే బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం ముందే ‘దిశ’ పసిగట్టి ప్రచురణ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

Next Story