MP కోమటిరెడ్డికి సీపీఎం నేత తమ్మినేని కౌంటర్

by GSrikanth |   ( Updated:2023-11-02 11:05:51.0  )
MP కోమటిరెడ్డికి సీపీఎం నేత తమ్మినేని కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో పోటీపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. గురవారం వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ.. పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట మార్చిందని అసహనం వ్యక్తం చేశారు. తమకు కావాల్సింది మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కాదని స్పష్టం చేశారు. అవమానకర రీతిలో ఉండే పొత్తులు తమకు అవసరం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఒక్క సీటు కూడా గెలవనివ్వమని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోతే సీపీఐ కూడా తమతో కలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, భద్రాచలం, అశ్వరావుపేట, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడెం, నల్లగొండ, నకిరేకల్, భువనగిరి, హుజూర్‌నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో సీపీఎం పోటీ చేయబోతున్నట్లు తెలిపింది.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed