BRS ఫస్ట్ లిస్ట్ ఎఫెక్ట్.. వేర్వేరుగా లెఫ్ట్ పార్టీలు అత్యవసర సమావేశం

by GSrikanth |   ( Updated:2023-08-22 06:59:38.0  )
BRS ఫస్ట్ లిస్ట్ ఎఫెక్ట్.. వేర్వేరుగా లెఫ్ట్ పార్టీలు అత్యవసర సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వామపక్ష నేతలు తమ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేద్దాం.. ఎలా ముందుకు పోవాలి.. అనే అంశాలపై కసరత్తును ప్రారంభించారు. మంగళవారం హైదరాబాదులోని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యాలయాల్లో వేరువేరుగా సమావేశమయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు అన్ని జిల్లా కార్యదర్శుల అనుబంధ కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాలోని నియోజక వర్గాల్లో రాజకీయ సమీకరణాలు, పోటీ చేస్తే కలిసి వచ్చే అంశాలు.. ఎవరిని బరిలో దింపితే ఆశించిన ఫలితాలు వస్తాయనే అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఇంతకాలం టీఆర్ఎస్‌కు నమ్ముకున్న కామ్రేడ్లు.. ఒక్కసారిగా కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేదు అనడంతో కామ్రేడ్‌లు ఉక్కిరి బిక్కిరి కావడంతోపాటు.. హుటాహుటిన రాష్ట్ర కార్యవర్గ భేటీ నిర్వహించారు. అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కామ్రేడ్లకు గడుకాలమే ఏర్పడింది. ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేపట్టకపోవడం, నిరసన కార్యక్రమాలు సైతం చేయబడడంతో ప్రజల్లోకి ఆశించిన మేర వెళ్లలేక పోయారు. మూడు నెలలే అసెంబ్లీ ఎన్నికల గడువు ఉండడంతో పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లి ఆదరాభిమానాలు చూడమంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. నామమాత్రంగానే పోటీ చేస్తారా.. బల నిరూపణకు సర్వశక్తులు వడ్డి గట్టెక్కుతారా అనేది సర్వత్ర ఆసక్తి నెలకొంది.

కొరకరాని కొయ్యగా కేంద్ర నాయకత్వం..

రాష్ట్రంలోని కామ్రేడ్లకు కేంద్ర నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి కొరకరాని కొయ్యగా మారింది. కేంద్రలోని బీజేపీ వ్యతిరేకంగా ఇండియా కూటమిలో చేరగా.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ అటు ఇండియా కూటమిలోని గాని, ఇటు ఇండియా కూటమిలో గాని చేరలేదు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు తరహా పొత్తులు ఉంటాయని కేసీఆర్ పేర్కొన్నప్పటికీ.. కేంద్ర నాయకత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే తెలంగాణలో పొత్తులకు నిరాకరించే అభ్యర్థులను ప్రకటించినట్లు సమాచారం. ఇండియా కూటమి తరపున రాష్ట్రంలో వామపక్షాలు ప్రచారం చేస్తే నష్టమని భావించే సీపీఎం, సీపీఐ పార్టీలను దూరం పెట్టినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు మునుగోడు తరహా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి రాదని భావనతోనే పోతులకు కేసీఆర్ ఫుల్‌స్టాప్ పెట్టినట్లు తెలిసింది. దీంతో ఇంతకాలం పోతులు ఉంటాయని భావించిన కామ్రేడ్లకు నిరాశే మిగిలింది.

మధ్యాహ్నం తర్వాత కార్యాచరణ ప్రకటించనున్న కామ్రేడ్లు

వామపక్ష పార్టీలు వేరువేరుగా పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వం మీడియా ముందుకు వచ్చి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే సీపీఐ పార్టీ హుస్నాబాద్, వైరా, కొత్తగూడెం, మునుగోడు, బెల్లంపల్లి, దేవరకొండ, సీపీఎం పార్టీ మిర్యాలగూడ, పాలేరు, భద్రాచలం, ఇబ్రహీంపట్నం, మధిర, నల్గొండ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. మిగిలిన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరికి మద్దతు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌తో కలిసి పోతే..?

బీఆర్ఎస్ పార్టీ వామపక్షాలను దూరం పెట్టడంతో కాంగ్రెస్ పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో పొద్దుతో పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే వామపక్షాలు ఆశిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఉండగా కొంతమంది సెట్టింగ్లు సైతం ఉన్నారు. అయితే ఆ నియోజకవర్గాలలో కాంగ్రెస్ వదులుకుంటుదా అనేది.. చూడాలి. గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా సీపీఐ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వారితో కలిసి పోయేందుకు సుముఖంగా ఉంటుందా..? పొత్తులకు అంగీకరిస్తుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ వామపక్షాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ముందుకు పోతాయని హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed