- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌లోకి వేముల వీరేశం.. MP కోమటిరెడ్డి రియాక్షన్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థిపై కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం నకిరేకల్ కాంగ్రెస్ నేతలతో వెంకట్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నకిరేకల్ అభ్యర్థిని పార్టీ అధిష్టానమే ఖరారు చేస్తుందని అన్నారు. స్థానిక నేత, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీ మారాలని చూస్తున్నారని.. అందుకే నకిరేకల్ టికెట్ ఎవరికి ఇవ్వాలనేదానిపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నుంచి చిరుమర్తి లింగయ్యను రెండుసార్లు గెలిపిస్తే పార్టీని నట్టేట ముంచి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, బీఆర్ఎస్ నుంచి నకిరేకల్ టికెట్ ఆశించిన వేముల వీరేశానికి అధిష్టానం భారీ షాకిచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన చిరుమర్తి లింగయ్యనే ఖరారు చేసింది. వేముల వీరేశం రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఈ క్రమంలో వేముల వీరేశం కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నట్లు వార్తలు విస్తృతం అయ్యాయి. ఈ క్రమంలో నియోజకవర్గ నేతలతో ఎంపీ కోమటిరెడ్డి సమావేశం అయ్యి అభిప్రాయాలు తీసుకున్నారు.