- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పిన వికలాంగుల విభాగం
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రకటించిన వికలాంగుల ఆరు వేల ఫించన్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యాత్రను మొదలు పెట్టారు. శనివారం గాంధీభవన్‌లో ఈ ప్రచార వాహనాన్ని మాజీ ఎంపీ విజయశాంతి చేతుల మీదుగా ప్రారంభించారు. గాంధీభవన్ నుంచి మధిర వరకు ఒక టీమ్, భద్రాచలం నుంచి రంగారెడ్డి జిల్లా వరకు మరో టీమ్ ఈ యాత్రను పూర్తి చేయనున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ.. వికలాంగులకు ఆరు వేల పెన్షన్ పెట్టడంపై రాహుల్, సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మొదటి సారిగా వికలాంగులు, వితంతువులు వృద్దులు, కల్లుగీత కార్మికుల పెన్షన్‌ను పెంచడం సంతోషంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ ని పవర్‌లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు దేశగాని సతీష్ గౌడ్, రాష్ట్ర నాయకులు ఆవుల వెంకటేష్, అర్జున్, హేమలత, సాజిద్ అలి, శంకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.