- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
బీఆర్ఎస్ టికెట్ కోల్పోయిన ఆ పదిమంది సిట్టింగులు వీళ్లే!
![బీఆర్ఎస్ టికెట్ కోల్పోయిన ఆ పదిమంది సిట్టింగులు వీళ్లే! బీఆర్ఎస్ టికెట్ కోల్పోయిన ఆ పదిమంది సిట్టింగులు వీళ్లే!](https://www.dishadaily.com/h-upload/2023/08/20/250872-brs-mlas.webp)
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 21న తెలంగాణ భవన్‌లో లాంఛనంగా విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, శ్రావణ పంచమి మంచి ముహూర్తం కావడంతో సోమవారం సాయంత్రం ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
దానికి తగిన కసరత్తు కూడా దాదాపు పూర్తయిందని తెలిపాయి. వివాదాస్పదంగా ఉన్న కొన్ని స్థానాలు మినహా దాదాపు వందకు పైగా అభ్యర్థులను ప్రకటించవచ్చని సూచనప్రాయంగా తెలిపాయి. కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు కావడంతో 105 మంది పేర్లను ప్రకటించవచ్చని అంచనా. ఇప్పటికే ఫస్ట్ లిస్టులో చోటు దక్కని స్థానాల్లో టికెట్‌ను ఆశిస్తున్నవారితో పాటు సిట్టింగులను ప్రగతి భవన్ పిలిపించుకుని బుజ్జగిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొద్దిమందితో ఫోన్‌లోనే మాట్లాడి తగిన అవకాశాలు కల్పిస్తామంటూ భరోసా ఇచ్చినట్లు తెలిసింది. అయితే, సిట్టింగుల్లో సీటు కోల్పోయిన ఎమ్మెల్యేల వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీటు కోల్పోయిన సిట్టింగుల్లో అధిక శాతం ఎస్టీలే ఉన్నట్లు తెలుస్తోంది.
1. బోథ్ నియోజకవర్గం : రాథోడ్ బాపూరావు
2. ఖానాపూర్ నియోజకవర్గం: రేఖా నాయక్
3. అసిఫాబాద్ నియోజకవర్గం: ఆత్రం సక్కు
4. జనగామా నియోజకవర్గం: ముత్తిరెడ్డి
5. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం: రాజయ్య
6. వైరా నియోజకవర్గం: రాములు నాయక్
7. ఇల్లందు నియోజకవర్గం: హరిప్రియా నాయక్
8. వేములవాడ నియోజకవర్గం: చెన్నమనేని రమేశ్
9. నర్సాపూర్ నియోజకవర్గం: మధన్ రెడ్డి
10. ఉప్పల్ నియోజకవర్గం: బేతి సుభాష్ రెడ్డి
పైన పేర్కొన్న ఎమ్మెల్యేల్లో అధికశాతం టికెట్లు కోల్పోయినట్లు వార్తలు వినవస్తున్నాయి. దీనిపై రేపు గులాబీ బాస్ కేసీఆర్ విడుదల చేయబోయే మొదటి జాబితాలో క్లారిటీ రానుంది.