Gautam Adani: పాఠశాలల ఏర్పాటుకు రూ.2,000 కోట్లు ప్రకటించిన గౌతమ్ అదానీ

by S Gopi |
Gautam Adani: పాఠశాలల ఏర్పాటుకు రూ.2,000 కోట్లు ప్రకటించిన గౌతమ్ అదానీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన కుమారుడు జీత్ అదానీ పెళ్లి సందర్భంగా రూ. 10 వేల కోట్ల విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అందులో రూ. 2,000 కోట్లతో 20 పాఠశాలలను నిర్మించేందుకు కేటాయించినట్టు ప్రకటించారు. ఈ మేరకు అదానీ ఫౌండేషన్ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే విరాళంగా ప్రకటించిన మొత్తం రూ. 6,000 కోట్లతో ఆసుపత్రుల నిర్మాణం, మరో రూ. 2,000 కోట్లతో నైపుణ్యాభివృద్ధికి కేటాయించిన సంగతి తెలిసిందే. స్కూళ్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులతో దేశవ్యాప్తంగా ప్రైవేట్ కె-12(కిండెర్‌గార్టెన్-టూ-12) వరకు గ్లోబల్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్(జెమ్స్) ద్వారా విద్యను అందించనున్నట్టు అదానీ ఫౌండేషన్ స్పష్టం చేసింది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రపంచ స్థాయి విద్య, అభ్యాస మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రధాన్యత ఇస్తామని పేర్కొంది. జెమ్స్ ఎడ్యుకేషన్ భాగస్వామ్యంతో ఇన్నోవేషన్, కేపబిలిటీ డెవలప్‌మెంట్‌తో కూడిన బోధనా సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించనున్నాం. ఈ నెల ప్రారంభంలో గౌతమ్ అదానీ తన చిన్న కుమారుడు జీత్ వివాహ వేడుక అందర్భంగా రూ. 10,000 కోట్లను సామాజిక ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తానని ప్రకటించారు.

Next Story

Most Viewed