మీ అబద్దాలకు తెలంగాణ సిగ్గుపడుతుంది: ఆకునూరి మురళి

by GSrikanth |
మీ అబద్దాలకు తెలంగాణ సిగ్గుపడుతుంది: ఆకునూరి మురళి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూపు-2 సంఖ్య పెంచడంతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ హామీలు గుప్పించారు. దీంతో ఇన్నాళ్లకు జాబ్ క్యాలెండర్ గుర్తొచ్చిందా? అంటూ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌పై సీరియస్ అయ్యారు. ‘మీ అబద్దాల హోరుకు తెలంగాణ సిగ్గుపడుతుంది. ఎన్నికలు వచ్చాయని ఓడిపోతామని భయపడి ఇంకో 9 రోజుల్లో ఎన్నికలు అనంగా తొమ్మిదిన్నరేళ్ల తర్వాత నిరుద్యోగులు గుర్తోచిన్రా? జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని గుర్తొచ్చిందా? ఐదు రూపాయల భోజనం చేసుకుంటూ ఏళ్ల తరబడి చిక్కడపల్లి, అశోక్‌నగర్ గల్లీలల్ల కష్టపడినప్పుడు, నువ్వు అమెరికా, యూరప్, దుబాయ్‌లు తిరుక్కుంటూ ఎంజాయ్ చేసినవే. మీకు తెలంగాణ యువత గురించి ఆలోచించే సోయి ఉందా? తెలంగాణ యువతను నిర్వీర్యం చేశారు. ఈ ఎన్నికల్లల్లో యువత మీకు మంచి గుణపాఠం చెప్తుంది.’ అంటూ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్యాకప్ కేటీఆర్, జాగో తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story