- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రజాకార్ చిత్ర నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రజాకార్ సినిమా నిర్మాత, భువనగిరి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి సోమవారం సీఈవో వికాస్ రాజ్‌ను కలిశారు. అనంతరం నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాము వందకు పైగా పుస్తకాలను ఆధారంగా చేసుకొని ‘రజాకార్’ అనే సినిమాను నిర్మించామని తెలిపారు. కేవలం ట్రైలర్ చూసి సినిమాను నిషేదించాలనడం సరికాదని అన్నారు. సినిమా చూసి అందరూ నిజాలు తెలుసుకోవాలనేది తమ తాపత్రయం అని అభిప్రాయపడ్డారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో రజాకార్ సినిమా వ్యవహారం దుమారం రేపుతోంది. రాజకీయ లబ్ధి కోసం నిర్మించిన ఈ సినిమాను, ప్రస్తుతం విడుదలైన టీజర్‌ను నిలిపివేయాలని పద్మవిభూషణ్ రావి నారాయణ రెడ్డి జాతీయ ఫౌండేషన్ సభ్యురాలు, రావి నారాయణ రెడ్డి మనుమరాలు రావి ప్రతిభారెడ్డి కోరారు.
అంతేకాదు.. ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే రజాకార్ సినిమాలో మతపరమైన అంశాలను పొందుపర్చారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఒక మతపరమైన పోరాటంగా చిత్రీకరించారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది అమరులయ్యారని వీరి గురించి సినిమాలో ఎందుకు చూపించడం లేదని ఆమె సినీ నిర్మాతలను ప్రశ్నించారు. దీనికి ఇవాళ నిర్మాత నారాయణ రెడ్డి స్పందించి వివరణ ఇచ్చారు.