తెలంగాణ ఓటర్లకు రాహుల్, ప్రియాంక కీలక పిలుపు

by GSrikanth |
తెలంగాణ ఓటర్లకు రాహుల్, ప్రియాంక కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ తెలంగాణ ఓటర్లకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కీలక పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇద్దరూ పోస్టులు పెట్టారు. ‘‘నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు. నా తెలంగాణ సోదరసోదరీమణులారా! రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనండి. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయండి’’ అంటూ రాహుల్ ట్వీట్ చేయగా.. ‘‘నా తెలంగాణ సోదర సోదరీమణులారా.. మా తల్లులారా.. పిల్లలారా. మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు వేయడం హక్కు. అది మీ అతిపెద్ద బాధ్యత. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి. అభినందనలు. జై తెలంగాణ. జై హింద్’’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు.

Advertisement

Next Story