- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం.. కాంగ్రెస్‌పై తమ్మినేని కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మరో ఇద్దరు అభ్యర్థులను ఆయన ప్రకటించారు. హుజూర్ నగర్ నుంచి మల్లు లక్ష్మి, నల్లగొండ నుంచి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పోటీలో ఉంటారని ప్రకటించారు. రేపు(మంగళవారం) కోదాడ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాదు.. ఇల్లందు, మునుగోడులోనూ పోటీ చేయాలని చూస్తున్నామని అన్నారు.
మునుగోడులో సీపీఐ పార్టీ పోటీ చేస్తే మద్దతు ప్రకటిస్తామని వెల్లడించారు. తమ పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదని హితవు పలికారు. తాము ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆపాలని ఫోన్ చేశారని తెలిపారు. ముందు తాము ఐదు సీట్లు అడిగామని చెప్పారు. భద్రాచలం నియోజకవర్గంలో సీపీఎం పార్టీ ఎనిమిది సార్లు గెలిచిన చరిత్ర ఉందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కూడా లేకుండా ఎలా పోటీ చేస్తామని అసహనం వ్యక్తం చేశారు. అసలు పొత్తులు పెట్టుకోవాల్సిన ఆలోచన తమకు ముందు నుంచి లేదని.. కాంగ్రెస్ నేతలే తమ వద్దకు వచ్చారని అన్నారు.