తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయే తొలి సీటు అదే!

by GSrikanth |
తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయే తొలి సీటు అదే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులంతా విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో గతానికి భిన్నంగా కాంగ్రెస్ శ్రేణులు దూసుకుపోతున్నారు. రాహుల్, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలతో ప్రచారం చేయిస్తున్నారు. ఈ క్రమంలో సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయే తొలి సీటు మధిర నియోజకవర్గమే అని జోస్యం చెప్పారు.


ఓడిపోయాక తాము సీపీఎంతో పొత్తు ఎందుకు పెట్టుకోలేదని భట్టి విక్రమార్క బాధపడతారని తమ్మినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాల అనంతరం కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకుంటుంది.. పొత్తుల విషయంలో తప్పటడుగు వేశామని భట్టి సైతం అనుకుంటారు. సీపీఎంతో కలిసి ఉంటే తాను మరోసారి గెలిచి, సీఎల్పీనో లేక సీఎంనో అయ్యేవాడినో అని భట్టి బాధ పడతారంటూ తమ్మినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ్మినేని వ్యాఖ్యలు ఖమ్మం జిల్లాలోనే కాక మొత్తం రాష్ట్రంలో కాకరేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Next Story