- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
IPL 2025 : గాయామా?.. వేటా?.. లక్నోతో మ్యాచ్‌కు రోహిత్ తప్పించడం వెనుక కారణమేంటి?

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు దూరమవడం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. రోహిత్ మోకాలికి గాయమైందని, అందుకే ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ సమయంలో వెల్లడించాడు. హిట్‌మ్యాన్ స్థానంలో ఓపెనర్‌గా విల్ జాక్స్‌ను తీసుకున్నారు. అయితే, రోహిత్‌కు నిజంగానే గాయపడ్డాడా? అన్న అనుమానం అభిమానుల్లో నెలకొంది. మ్యాచ్‌కు ముందు అతను గాయపడినట్టు ఎలాంటి వార్త బయటకు రాలేదు. అతనిపై కావాలనే వేటు వేశారా? అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. కేవలం 21 రన్సే చేశాడు. చెన్నయ్‌తో ఓపెనింగ్ మ్యాచ్‌లో డకౌటైన అతను.. గుజరాత్(8), కోల్‌కతా(13) మ్యాచ్‌ల్లోనూ దారుణంగా నిరాశపరిచాడు. పేలవ ప్రదర్శన నేపథ్యంలోనే రోహిత్‌ను తుది జట్టు నుంచి తప్పించారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లక్నోతో మ్యాచ్‌కు రోహిత్‌తోపాటు తిలక్ వర్మను కూడా పక్కనపెట్టారు.