వామపక్షాలకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్.. సెకండ్‌ లిస్ట్‌లో సీట్ల ప్రకటన!

by GSrikanth |
వామపక్షాలకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్.. సెకండ్‌ లిస్ట్‌లో సీట్ల ప్రకటన!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల 55 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. వామపక్షాల మధ్య పొత్తు ఉంటుందని భావించినా మొదటి నుంచి సీపీఎం అడిగిన భద్రాచలం స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థి పొదెం వీరయ్యను ప్రకటించింది. దీంతో సీపీఎం కొంత నిరుత్సాహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం సీపీఐ జాతీయ నేత డి.రాజాకి ఫోన్ చేసినట్లు సమాచారం. దీంతో సీపీఐతో పొత్తు ఖరారు అయినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం సీట్లకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం సీపీఎం నేతలతోనూ పొత్తు గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. సఫలం అయితే ఆ పార్టీకి కూడా రెండు సీట్లు కేటాయించి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ సెకండ్ అభ్యర్థుల లిస్ట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా వామపక్షాలు కాంగ్రెస్ అధిష్టానానికి ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో ఆరు అసెంబ్లీ స్థానాల సీట్లు అడిగినట్లు తెలిసింది. మునుగోడు టికెట్ సీపీఐ, మిర్యాలగూడ, పాలేరు టికెట్ సీపీఎం ఆశిస్తున్నది. సీట్ల సర్ధుబాబులో తేడా జరిగితే వామపక్షాలు మరోసారి చర్చలు జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది.

తెలంగాణ సీపీఐలో ముసలం..?

తెలంగాణ సీపీఐలో ముసలం ఏర్పడింది. మునుగోడు సీటు వదులుకోవడంపై నల్గొండ సీపీఐ నేతలు భగ్గుమంటున్నారు. పొత్తుల్లో భాగంగా మునుగోడు టికెట్ సీపీఐకి కేటాయించక పోవడంతో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అలక చెందినట్లు టాక్ నడుస్తోంది. ఇండిపెండెంట్‌గా అయిన సరే బరిలోకి దిగెందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కొత్తగూడెం కోసం మునుగోడును వదిలేశారనే విమర్శలు చేస్తున్నారు. కమ్మ నేత కోసం బీసీ నేతను బలి పశువు చేశారంటున్న జిల్లా సీపీఐ నేతలు వాపోతున్నారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలో సొంతంగా పోటీ చేయడానికి రెడీ అయినట్లు టాక్ వినబడుతోంది.

Advertisement

Next Story

Most Viewed