- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు రెండు చోట్లా ఓటమి తప్పదు
దిశ, తెలంగాణ బ్యూరో: కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇద్దరూ ఓడిపోతున్నారని, అలాగే సీఎం కేసీఆర్ గజ్వేల్‌లోనూ ఓటమి చవిచూస్తారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జీ ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కామారెడ్డి, గజ్వేల్‌లో బీజేపీ గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు.
దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు రెండు శాతం మందికి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని జవదేకర్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో ఎన్నో తప్పిదాలు జరిగాయని, దీనికి ముఖ్యమంత్రే కారణమని ఆయన విమర్శలు చేశారు. కేసీఆర్‌ను భూ దొంగ అని ప్రజలు తిడుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని 2004లో కలిసి పోటీచేశాయని ఆయన గుర్తుచేశారు. 50 ఏండ్లు ప్రత్యేక రాష్ట్రం రాకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. 1965లో 350 మంది మరణానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని విమర్శలు చేశారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని జవదేకర్ ఫైరయ్యారు.