- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ భాగ్యలక్ష్మి ఆలయ ప్రస్తావన.. కేసీఆర్‌కు బండి సంజయ్ సంచలన సవాల్
దిశ, జగిత్యాల టౌన్: ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తేనే కేసీఆర్‌కు జ్వరం ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం రాత్రి జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగిత్యాల టూర్‌లో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘గాంధీని నిజంగా పూజించేది మీరే అయితే.. మరి మీ నాన్న కేసీఆర్ గాంధీ జయంతికి రాకుండా గాడ్సేను పూజించేందుకు వెళ్లాడా?’ అని కేటీఆర్‌ను బండి ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం ఎన్టీఆర్‌ను పేరును కేటీఆర్‌కు పెట్టింది నిజం కాదా? అని ఘాటు విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయ బిక్ష పెట్టింది బీజేపీనే అని విరుచుకుపడ్డారు. మోడీ దగ్గర కేటీఆర్‌ను సీఎం చేస్తా అని చెప్పిన మాట వాస్తవం కాదా? అని సూటిగా ప్రశ్నించారు.
కేసీఆర్ తనకు ఆరోగ్యం బాగా లేదని తన కొడుకును సీఎం చేసేందుకు సపోర్ట్ చేయాలని మోడీని కోరింది నిజం కాదా? అన్నారు. ఇందులో నిజం లేకుంటే తడి బట్టలతో భాగ్యలక్ష్మి ఆలయంలోకి కేసీఆర్ రావాలని సవాల్ విసిరారు. కల్వకుంట్ల కుటుంబమే చీటర్స్ ఫ్యామిలీ అని మీ కుటుంబాన్ని చూస్తే పిచ్చి కుక్కలు కూడా పారిపోతాయని ఘాటు విమర్శలు చేశారు. అలాంటి చీటర్స్‌కు ప్రధాని మోడీని విమర్శించే స్థాయి లేదని అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తుందని కేసీఆర్‌ను చూస్తే నిజాం పాలన గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రధాని మోడీ టూర్ గ్రాండ్ సక్సెస్ అయిందని 20 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం కేసీఆర్‌కు నిద్ర పట్టకుండా చేస్తుందని అన్నారు.