- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కానిస్టేబుల్‌ను చెంపపై కొట్టిన YS విజయలక్ష్మి (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: అరెస్ట్ అయి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో షర్మిలను పరామర్శించేందుకు YS విజయలక్ష్మి ఆగ్రహంతో ఊగిపోయారు. షర్మిలను కలిసేందుకు అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన కూతురు వైఎస్ షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతోందని, సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తున్న గొంతులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని విజయమ్మ అన్నారు. ప్రజలకు, నిరుద్యోగులకు న్యాయం చేయడం చేతకాదు కానీ, షర్మిలను అరెస్ట్ చేయడం మాత్రమే చేతనవుతుందని ఎద్దేవా చేశారు. అసలు షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని, తనను షర్మిలకు కలిపించాలని, ఎంతసేపయినా పోలీస్ స్టేషన్ ఎదుటే కూర్చుంటానని వైఎస్ విజయలక్ష్మి స్పష్టం చేశారు.
Also Read..
పోలీసులపై చేయి చేసుకున్న YS షర్మిల.. కేసు నమోదు (వీడియో)
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు YS విజయలక్ష్మి.. పోలీసులపై సీరియస్