- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుట్నాల గంప కాదు.. నడిరోడ్డుమీద లిక్కర్ బాటిళ్ల విక్రయాలు (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరుస కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పథర్థాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రామాల్లో బెల్టు షాపులు కూడా మూసివేయించాలని ఎక్సైజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆదేశాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. విచ్చలవిడిగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా.. వెలుగుజూసిన ఈ ఘటనే నిదర్శనంగా మారింది.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గాకు సమీపంలోని దక్కన్ సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు వెంటనే మహిళలు అడ్డగోలుగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. సంతలో సరుకులు అమ్మినట్లు క్వార్టర్ బాటిల్స్ అమ్మకాలు జరుపుతున్నారు. పర్మిట్ వైన్స్ వాళ్ళే సంవత్సరానికి బాండ్ రాసి ఇస్తున్నట్లు సమాచారం. అసలు ఈ మద్యం ఒరిజినల్? నకిలీదా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహిళలు మద్యం అమ్ముతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మాటల్లో కాదు.. చేతల్లో చూపించి ఆదర్శంగా నిలవాలని సూచనలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు వెంట మద్యం అమ్మకాలు అరికట్టాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.
బెల్టు షాపులు వద్దు.. డైరెక్ట్ రోడ్డు మీదనే మద్యం అమ్మండి!
— Telugu Scribe (@TeluguScribe) March 3, 2024
రోడ్డు మీదే తాగండి.. తాగి ఊగండి..
ఓ పక్క బెల్టు దుకాణాలు రద్దు చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం.. సంతలో సరుకులు, పశువులు అమ్మినట్లు మద్యం అమ్మకాలు. రోడ్డు పక్కనే సంచుల్లో అట్టా పెట్టెలో పెట్టుకొని మద్యం విక్రయాలు.… pic.twitter.com/PRbuGqZa0i