- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైలులో మహిళా దొంగల హల్‌చల్..

X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో మహిళా దొంగలు రైలులో చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. షిర్డీ రైలులో మహిళా దొంగలు హల్ చల్ చేశారు. ఈనెల 11న రాత్రి షిర్డీ రైలులో ప్రయాణీకుల వస్తువులు, నగదును మహిళా దొంగలు చోరీ చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో క్రాసింగ్ ఉండటంతో రైలు నిలిచింది.
ఆ సమయంలో రైలులో మహారాష్ట్రలోని బిడ్ జిల్లాకు చెందిన మహిళలు చొరబడ్డారు. అన్ని బోగీలు తిరుగుతూ ఏమరపాటుగా ఉన్న ప్రయాణీకుల బ్యాగులను మహిళా దొంగలు మాయం చేశారు. బాసర వద్ద చైన్ లాగి పారిపోయే క్రమంలో ప్రయాణీకులు అలర్ట్ అయి దొంగలను పట్టుకున్నారు. మహిళా దొంగలను జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. రైల్వే పోలీసులు సదరు దొంగలను విచారిస్తున్నారు.
Next Story