- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Srinivas Goud : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని అరెస్ట్ చేస్తారా?
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) ను పోలీసులు నేడో రేపో అరెస్టు(arrest) చేసే అవకాశముందన్న ప్రచారం జోరందుకుంది. విధుల్లో ఉన్న పోలీస్ అధికారులనూ దూషించారన్న అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయనను అరెస్టు చేయవచ్చన్న ప్రచారం నెలకొంది. ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్త అరెస్టును నిరసిస్తూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు శ్రీనివాస్ గౌడ్ ధర్నా చేసిన సందర్భంలో సీఐపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ కార్యకర్తను పోలీసులు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ గౌడ్ ధర్నా చేశారు.
ధర్నా సందర్భంగా సీఐ అప్పయ్యకు, శ్రీనివాస్ గౌడ్ కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడం వివాదస్పదమైంది. విధుల్లో ఉన్న పోలీసు అధికారులను దూషించారంటూశ్రీనివాస్ గౌడ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ భ కబ్జా కేసుల్లో జైలులో ఉన్నారు. వరుస కేసులత కొంత ఆయనకు రాజకీయంగా ఇబ్బందికర చిక్కుల్లో పడ్డారు . శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పలువురిపై అక్రమ కేసులు పెట్టించి వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. వరుస కేసులు కొంత ఆయనకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారిందంటున్నారు.