ఆ విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు మాతో కలిసి వస్తారా..? టీపీసీసీ చీఫ్ సంచలన సవాల్

by Ramesh Goud |
ఆ విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు మాతో కలిసి వస్తారా..? టీపీసీసీ చీఫ్ సంచలన సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్త సర్వే విషయంలో కేంద్రాన్ని అడిగేందుకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు (BRS, BJP Leaders) మాతో కలిసి వస్తారా? అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) సవాల్ విసిరారు. తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly Sessions) బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును (BC Reservations Bill) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శాసన మండలిలో మహేష్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలు ఈ రోజును చారిత్రాత్మక దినంగా జరుపుకుంటారని సంతోషం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదంతో.. సామాజిక న్యాయం కాంగ్రెస్ (Congress) తోనే సాధ్యమవుతుందనే సత్యం నిరూపితమైందని అన్నారు.

అయితే విపక్షాలకు బీసీలపై ప్రేమ ఉంటే దేశ వ్యాప్తంగా కులగణన సర్వే కోసం కేంద్రాన్ని అడగడానికి కాంగ్రెస్ తో కలిసి వస్తారా అని ఛాలెంజ్ చేశారు. చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశ పెడుతున్న కాంగ్రెస్ తో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి రాకపోతే బీసీ సామజిక వర్గం ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ క్షమించరని అన్నారు. అలాగే బీజేపీ వాళ్లకు నిజంగా బీసీలకు న్యాయం చేయాలని ఉంటే బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రంలో కూడా ఆమోదించేలా కేంద్రాన్ని ఒప్పించాలని పేర్కొన్నారు.

ఇక సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందనడానికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు లను చట్ట సభలో ఆమోదించడమే నిదర్శనం అని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కాంగ్రెస్ చరిత్ర సృష్టించిందని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. దేశ వ్యాప్త కులగణనకు వెంటనే శ్రీకారం చుట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేగాక బీజేపీకి చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు మద్దతు తెలిపాలని అన్నారు. అలాగే కేంద్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం బీఆర్ఎస్ ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు.

Next Story