- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్నికలు రాగానే రేవంత్ డైలాగులు కొట్టుడు నేర్చిండు: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు రాగానే ఎన్టీఆర్, బాలకృష్ణ లెవల్లో డైలాగులు కొట్టి ప్రజలకు మోసం చేసుడు సీఎం రేవంత్‌రెడ్డి అలవాటైందని బీజేపీ శాసనసభ పక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రతి డిపార్ట్‌మెంట్‌పై రివ్యూ చేసిన సందర్భం లేదని మండిపడ్డారు. అసలు ప్రభుత్వ శాఖల్లో ఏం జరగుతోందో రివ్యూ చేసి వాస్తవాలు తెలుసుకుని, ఏ డిపార్టుమెంట్‌కు ఎంత బడ్జెట్ అవసరం అవుతుందో కేటాయించే బాధ్యత ఆయనపై లేదా అని ప్రశ్నించారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో అసలు రేవంత్ రెడ్డికి గుర్తుందో లేదోనని ఎద్దేవా చేశారు. రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో అన్నదాతలకు అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చాలని అన్నారు. సీఎం ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలిదని ఆరోపించారు. ఒక రోజు ప్రధాని నరేంద్ర మోడీని పట్టుకుని భడే భాయ్ అంటాడని.. మరో రోజు సీబీఐ, ఈడీ బీజేపీకి తొత్తులు అని గొంతు చించుకుంటాడంటూ మహేశ్వర్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.