పథకం ఏదైనా సరే ముందుగా నా నల్లగొండ బిడ్డలకే అందాలి: మంత్రి కోమటిరెడ్డి

by Mahesh |   ( Updated:2024-03-06 15:44:59.0  )
పథకం ఏదైనా సరే ముందుగా నా నల్లగొండ బిడ్డలకే అందాలి: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి తోడ్పాటు అందించిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంది. ఈ క్రమంలో మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ క్రమంలో చేవెళ్లలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్, మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క, కొండా సురేఖ లు మొదటి లబ్ది దారులకు 500 గ్యాస్ సిలిండర్ అందించారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. నేను ఎక్కడ ఉన్నా.. నా హృదయం మాత్రం నల్లగొండ కోసం పరితపిస్తుందని, ప్రభుత్వం ఏ పథకం ప్రవేశ పెట్టిన ముందుగా నా నల్లగొండ బిడ్డలకే అందాలని కోరుకుంటానని రాసుకొచ్చారు. దీంతో మంత్రి ట్వీట్ పై పొలిటికల్ వర్గాల్లో విభిన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story