ఉరి వేసుకుని యువతి మృతి..

by Nagam Mallesh |
ఉరి వేసుకుని యువతి మృతి..
X

దిశ భీమదేవరపల్లి: ఉరేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలో గురువారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన మార్పాటి మహేందర్ రెడ్డికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు నికిత వయసు 22 సంవత్సరాలు. నికిత అమ్మమ్మ పారుపల్లి వెంకటమ్మతో ఎక్కువ చనువుగా ఉండేది. అయితే అమ్మమ్మ ఈ నడుమ అస్సలు ఇంటికి రాకపోయేసరికి ఎందుకు రావట్లేదని నిత్యం నికిత బాధపడుతూ ఉండేది. ఈ మనస్థాపంతోనే ఆమె బుధవారం అందరూ రాత్రి భోజనం చేసిన తర్వాత పైన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముల్కనూర్ నండ్రు సాయిబాబు తెలిపారు.

Advertisement

Next Story