నైబర్‌హుడ్ ఛాలెంజ్‌ టాప్ 10లో వరంగల్..

by Disha News Desk |
నైబర్‌హుడ్ ఛాలెంజ్‌ టాప్ 10లో వరంగల్..
X

దిశ, వరంగల్ టౌన్: నైబర్ హుడ్ ఛాలెంజ్ పోటీల్లో వరంగల్ నగరం ఎంపిక కావడం హర్షనీయమని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. నైబర్ హుడ్ ఛాలెంజ్ పోటీల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో వరంగల్ నగరానికి టాప్-10 జాబితాలో చోటుదక్కడం గర్వంగా ఉందన్నారు. ఇందుకోసం ప్రణాళిక బద్ధంగా కృషి చేసిన కమీషనర్, తోటి సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఎన్ఎన్‌సి శిశువులు, పసిబిడ్డల సంరక్షకులకు(ఐటిసి) సౌకర్యాలను అందించడంపై దృష్టి సారించి, పరిసరాలను స్నేహపూర్వకంగా, సురక్షితంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుని ఎన్‌ఎన్ సినీ భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోసింగ్ అఫైర్స్ నవంబర్ 2020లో ప్రారంభించిదన్నారు.

స్మార్ట్ సిటీ మిషన్ కింద హన్మకొండలోని శ్రీదేవి మాల్ పక్కన ఉన్న అంగన్‌వాడీని పునరుద్ధరించడం, ఐటీసీకి రహదారి భద్రతను మెరుగుపరచడం, ఫుట్‌పాత్‌లు, సిగ్నేజ్‌లు, చిల్డ్రన్స్ పార్కును అనుసంధానించే రహదారిలో పిల్లలకు ఇంటరాక్టివ్ గేమ్‌లు అందించడం, బాలసముద్రం వద్ద ఉన్న పెట్ పార్క్ ఏర్పాటు, ఆట పరికరాలను అందించడం వంటి ప్రతిపాదనలను జీడబ్ల్యుఎంసీ ఫిబ్రవరి 2021లో సమర్పించిదన్నారు. తమ ప్రతిపాదనలను సమర్పించిన 63 నగరాల్లో మొదటి 25 నగరాల్లో జీడబ్ల్యూఎంసీ ఎంపికైందని తెలిపారు. పిల్లలు జాతీయ జెండాను పట్టుకుని చిల్డ్రన్స్ పార్కు వరకు 1.5 కి.మీ దూరం నడిచారని చెప్పారు.


Advertisement

Next Story

Most Viewed