- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటరు నమోదుకు ప్రత్యేక క్యాంపులు : కలెక్టర్
దిశ, కాటారం : ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం 2025 లో భాగంగా 01.01.2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు నూతన ఓటరు నమోదు చేసుకోవడానికి శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ ప్రత్యేక క్యాంపుల్లో నూతన ఓటరు నమోదుకు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు సరి చేయుట, మరణించిన వ్యక్తుల వివరాలు తొలగించండంతో పాటు ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నివాసాన్ని మారిన ప్రతి ఓటరు జాబితాలో మార్పుకు దరఖాస్తు చేసుకోవడానికి 9వ తేదీ శనివారం, 10వ తేదీ ఆదివారాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం స్పెషల్ క్యాంపెన్ డేస్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ఓటర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూతు స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు.