ప్రపంచ వారసత్వ వేడుకలకు రామప్ప సిద్ధం

by samatah |
ప్రపంచ వారసత్వ వేడుకలకు రామప్ప సిద్ధం
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో ప్రపంచ వారసత్వం వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మంగళవారం రామప్ప రామలింగేశ్వర దేవాలయంలో జరగనున్న ప్రపంచ వారసత్వ వేడుకలు శిల్పం, వర్గం, కృష్ణం' పేరుతో జరగనున్నాయి.

ఈ వేడుకల్లో భాగంగా దేవాలయ పరిసరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్, 250 మంది కూచిపూడి కళాకారులతో నృత్య ప్రదర్శన, 75 మంది అరబి ఇన్ స్టిట్యూట్ వారి వయ్యో లిన్ తోపాటు పేరణి నృత్యం, రావణ అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ది లెవన్ హెడ్, బెంగళూరుకు చెందిన సూర్య ఎస్. రావు, హెరిటేజ్ ఆఫ్ ఇండియా శ్రావ్య మానస ప్రదర్శనలు ప్రఖ్యాత డ్రమ్స్ కళాకారుడు శిమణి సంగీత ప్రదర్శన జరగనున్నాయి.పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్,గాయకులు కార్తీక్, ఫ్రూట్ నవీన్ తోపాటు మరికొందరు సినీ ప్రముఖులు, కళాకారుల ప్రదర్శనలు ఉండనున్నాయి. ఈ కార్యక్రమానికి బలగం చిత్రంలోని నటీనటులు హాజరవ్వనున్నారు, మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ హాజరుకానున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story