MLA : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చీటింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు

by Kalyani |   ( Updated:2024-10-18 08:50:54.0  )
MLA : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చీటింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు
X

దిశ, రాయపర్తి : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, రైతుల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. అందులో భాగంగానే రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ అందిస్తూ రైతులను రాజు చేయడమే లక్ష్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కొనుగోలు కేంద్రాలలో ఎవరైనా చీటింగ్ చేసినట్లయితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు కాట్రపల్లి గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా దేవితో కలిసి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి మాట్లాడుతూ… రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వంగా పనిచేస్తుందన్నారు. అందులో భాగంగానే రైతులకు సన్న రకం ధాన్యానికి క్వింటాల్ కురూ. 500 రూపాయలు బోనస్ అందిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తరలించి మద్దతు ధరతో పాటు బోనస్ పొందాలని ఆమె కోరారు. రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు.

దొడ్డు రకం, సన్న రకం ధాన్యాన్ని వేరువేరు కల్లాలుగా ఏర్పాటు చేసి వాటి ద్వారా కాంటాలు జరపాలని అన్నారు.పేదింటి ఆడ పిల్లలకు కల్యాణలక్ష్మి పథకం వరం లాంటిదని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో 12 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ పథకం భరోసానిస్తుందన్నారు. ఈ పథకంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, పిఎసిఎస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్, ఏవో వీరభద్రం, ఏ ఈ ఓ లు మనస్విని సాయి, ఏపీవో కుమారస్వామి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ కృష్ణమాచార్యులు, డైరెక్టర్ పెండ్లి మహేందర్ రెడ్డి, ఏపీఎం కిరణ్ నాయకులు, బిజ్జాల సోమనాదం, కుందూరు జయపాల్ రెడ్డి కృష్ణారెడ్డి, రెంటాల గోవర్ధన్ రెడ్డి, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, మంద యాకూబ్ రెడ్డి, ఉల్లెంగుల నరసయ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story

Most Viewed