- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మకర సంక్రాంతి శోభలో నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
దిశ,గీసుగొండ: మకర సంక్రాంతి సందర్భంగా వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధి ప్రఖ్యాతిగాంచిన గీసుగొండ మండలంలోని ఊకల్ శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మకర సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఆలయ ప్రధానార్చకులు సముద్రాల సుదర్శనాచార్యుల స్వామి వారిని చెరుకు గడలతో హరిత సూర్య భగవానుడి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.... సూర్యభగవానుడు ఈరోజు ధనుస్సు రాశి నుండి తన స్వస్థానమైన మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటామని తెలిపారు. ఇవాల్టి నుండి సూర్య భగవానుడి దక్షిణాయనం పూర్తై ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ పండుగ అన్ని పండుగల కన్నా విశిష్టమైనదని అన్నారు.
ఈ పండుగకు రైతులకు తమ పంటలు అన్ని చేతికి అందుతాయని దానికి ప్రతీకగా ఈరోజు స్వామివారిని హరిత వర్ణం ఉట్టిపడే విధంగా స్వామివారిని చెరుకు గడలతో ప్రత్యేకంగా అలంకరించినట్లు సుదర్శనాచార్యుల తెలిపారు. స్వామి వారిని చెరుకు గడలతో పాటు బసవన్న,పాల కడువాల ప్రతిరూపాల అలంకరణతో నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపం మంత్రముగ్ధులను చేసింది. దేవాలయ ప్రాంగణంలో చెరుకు గడలతో అలంకరించడం తో దేవాలయం హరితవర్ణం గా మారింది. స్వామి వారిని దర్శించుకోవడానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు సముద్రాల శ్రీహర్ష, రాజేష్,ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.