Vinod Kumar : కాళోజీ నారాయణరావు తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారు

by Kalyani |
Vinod Kumar : కాళోజీ నారాయణరావు తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారు
X

దిశ, హనుమకొండ : హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం కరీంనగర్ మాజీ ఎంపీ, మాజీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కాళోజీ నారాయణరావు జయంతి నేపథ్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా కవి కాళోజీ నారాయణరావు జీవిత చరిత్ర, ఆయన తెలుగు ప్రాముఖ్యత ను వివరించిన తీరు అమోఘమని, ఆయన తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ బి ఫామ్ పై గెలిచి, పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేల అన‌ర్హత పిటిష‌న్‌ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్పీకర్ విచారణ చేసి త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన శాసన సభ్యులు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ల పై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వద్ద ఉన్న పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగిందని, సుదీర్ఘమైన చర్చల అనంతరం తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం నాలుగు వారాల లోపు ఈ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశించిందని అన్నారు.

బిఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్ పై స్పీకర్ గడ్డం వెంటనే స్పందించి 4 వారాల లోపు చర్యలు తీసుకోవాలని, లేనిచో హైకోర్టు మళ్లీ జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. 2004- 09 తాను హనుమకొండ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసిన అప్పటి ఎంపీ ఆలే నరేంద్ర పై స్పీకర్ సోమనాథ్ చటర్జీ పిటిషన్ వేశామని గుర్తు చేశారు. పార్టీ మారిన సభ్యుల విషయంలో పార్టీల స్పీకర్లు నాన్చుడు ధోరణి తీరుతో తీర్పు ఆలస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ్యులు గాని పార్లమెంట్ సభ్యులు గాని పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీ మారిన అనర్హత వేటు వేయాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed