- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాను : ఎమ్మెల్యే కడియం
దిశ,హనుమకొండ టౌన్ : తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను అధికార కాంగ్రెస్ పార్టీలో చేరానని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తన కూతురు కడియం కావ్య తో కలిసి హన్మకొండలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆర్ నాగరాజును, ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ దంపతులను ఆయన కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు.
బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్‌తో మాత్రమే సాధ్యమని చెప్పారు. ఎమ్మెల్యే ఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ప్రజలను మరోసారి మోసం చేసేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనకు వస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయనకు ఏటీఎంలా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులను పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో ప్రస్తుత కరువు పరిస్థితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తే ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని హెచ్చరించారు.