నర్సంపేటకు ప్రభుత్వ మెడికల్ కాలేజి..

by Sumithra |
నర్సంపేటకు ప్రభుత్వ మెడికల్ కాలేజి..
X

దిశ, నర్సంపేట : నర్సంపేట నియోజక వర్గానికి ప్రభుత్వ మెడికల్ కాలేజి మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. గత 5 సంవత్సరాల నుండే మెడికల్ కాలేజి ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే జీవో నెంబర్ 83ను విడుదల చేస్తూ ఉత్తర్వులను తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసింది.

వరంగల్ జిల్లా చరిత్రలోనే చిరస్థాయిగా నర్సంపేట నిలబడనుందని ఎమ్మెల్యే కొనియాడారు. హెల్త్ హబ్ గా నర్సంపేట మారనుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో పేద ప్రజలకు అందుబాటులోకి విద్యా-వైద్యం మరింత చేరువ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కి మనస్ఫూర్తిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story